ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​YS Rajasekhar Reddy | వైఎస్​ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి

    YS Rajasekhar Reddy | వైఎస్​ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: YS Rajasekhar Reddy | మాజీ సీఎం దివంగత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి (YS Rajasekhar Reddy) ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సేవలు మరువలేనివని.. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Urdu Academy Chairman) తాహెర్ బిన్ హందాన్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్​ చిత్రపటానికి నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా తాహెర్​ మాట్లాడుతూ వైఎస్​ రాజశేఖర్ రెడ్డికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఒకప్పుడు ఆయన ఒక పుట్టిన రోజును నిజాంసాగర్​లో జరుపుకున్నారని గుర్తు చేశారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం(Alisagar Lift Irrigation Scheme) ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైఎస్​దేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నుడా(NUDA) ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ఎన్​ఎస్​యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఎస్టీసెల్​ అధ్యక్షుడు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్​మన్​ కమిటీ ఛైర్మన్​ శ్రీనివాస్, వినయ్, లవంగ ప్రమోద్, స్వామి గౌడ్, ముశ్షు పటేల్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Christian Medical College | మెడికల్​ కాలేజీ పున:ప్రారంభం పేరిట మోసం.. జీతాలు చెల్లించకుండా పరార్.. మోసపోయిన ప్రముఖ వైద్యుడు​

    YS Rajasekhar Reddy | జుక్కల్​ క్యాంప్​ కార్యాలయంలో..

    వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బిచ్కుంద: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్​ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

    YS Rajasekhar Reddy | ప్రజలతో మమేకమై..

    నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Lakshmi Kantha Rao) క్యాంప్​ ఆఫీస్​లో మంగళవారం ప్రజలను నుంచి అర్జీలను తీసుకున్నారు. వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారం నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మద్నూర్​ ఏఎంసీ(Madnoor AMC) వైస్​ ఛైర్మన్​ పరమేష్​ పటేల్​, కల్లాలి రమేశ్​ దేశాయ్​ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Judo selections | రేపు జూడో సబ్ జూనియర్ ఎంపిక పోటీలు

    స్థానికుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this