అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana CS | తెలంగాణ Telangana ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా CS రామకృష్ణారావు Ramakrishna Rao నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును ప్రభుత్వం సీఎస్‌గా నియమించింది. ఆయన మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్థికశాఖపై పట్టు ఉన్న ఆయనను సీఎస్‌గా నియమించినట్లు తెలుస్తోంది.