ePaper
More
    HomeతెలంగాణSrisailam Project | నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్ట్​.. నేడు తెరుచుకోనున్న గేట్లు

    Srisailam Project | నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్ట్​.. నేడు తెరుచుకోనున్న గేట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల ప్రాజెక్ట్​(Jurala Project)కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ఇప్పటికే జూరాల నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)​కు భారీ ఇన్​ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​కు 1,72,705 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 881 అడుగుల (193.4 టీఎంసీలు) నీరు ఉంది.

    Srisailam Project | ఎగువన ప్రాజెక్ట్​లు ఫుల్​

    కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో కర్ణాటక(Karnataka)లో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్ట్​లు నిండాయి. దీంతో వాటి గేట్లను కూడా ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉంటడంతో అధికారులు గేట్లు ఎత్తడానికి సిద్ధం అయ్యారు.

    Srisailam Project | గేట్లు ఎత్తనున్న ఏపీ సీఎం చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మంగళవారం శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల ద్వారా విద్యుత్​ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్​(Nagarjuna Sagar)కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారడం.. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉండటంతో జలాశయం వరద గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తనున్నారు. ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన పూజలు చేస్తారు. అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తారు.

    Srisailam Project | ప్రాజెక్ట్​ చరిత్రలో రికార్డు

    శ్రీశైలం ప్రాజెక్ట్​ గేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్​లో ఎత్తుతారు. ప్రాజెక్ట్​ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది జులై తొలివారంలోనే గేట్లు ఎత్తనుండడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్​ 1981లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు మాత్రమే జులైలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2007లో జులై 23న, 2001లో జులై 28న, 2022లో 23న, 2024లో జులై 29న ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తారు. ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది జులై 8న ప్రాజెక్ట్​ నుంచి నాగర్జున సాగర్​కు నీరు విడుదల చేయనున్నారు. కాగా శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కేంద్రానికి లేఖ రాసింది. డ్యాం గేట్లు ఇప్పుడే ఎత్తవద్దని కోరింది.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...