ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

    America | అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవ దహనం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్ : America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన కుటుంబం సజీవ దహనం అయింది. ఒళ్లు గగొర్పొడిచే ఈ ఘటన గ్రీన్‌కౌంటీ (Green County) ఏరియాలో చోటు చేసుకుంది. కారును భారీ ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

    America : అట్లాంటా నుంచి డల్లాస్​ వెళ్తుండగా..

    ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా వెంకట్, తేజస్విని దంపతులు మృతి చెందారు. వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని నలుగురు కూడా సజీవ దహనం అయ్యారు. అట్లాంటా (Atlanta) నుంచి డల్లాస్‌(Dallas) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

    America : మొత్తం బూడిదగా మారి..

    బాధిత కుటుంబం డల్లాస్​లో నివసిస్తున్నట్లు సమాచారం. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. దీంతో వాటి ఆనవాళ్లను పోలీసులు ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. తదుపరి మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

    అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్​లోని వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆహ్లాదంగా విహారానికి వెళ్లి, బంధువులతో సరదాగా గడిపి.. తిరిగి వెళ్తుండగా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...