ePaper
More
    Homeటెక్నాలజీiPhone 15 | అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ప్రైమ్ యూజర్లకు అమెజాన్ ఆఫర్

    iPhone 15 | అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ప్రైమ్ యూజర్లకు అమెజాన్ ఆఫర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: iPhone 15 | ఐఫోన్ 15 అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేసే అవకాశం రానుంది. అమెజాన్ తన యూజర్ల కోసం జూలై 12 నుంచి ప్రైమ్ డే సేల్ (Prime Day sale) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అతి తక్కువ ధరకే ప్రముఖ సంస్థ యాపిల్​కు చెందిన ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా ఈఎంఐ ఎంపికలను (bank cards or EMI options) ఉపయోగించి అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సెప్టెంబర్ 2023లో మార్కెట్​లోకి లాంచ్ అయిని ఐఫోన్ 15 శక్తివంతమైన 48-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, అధునాతన చిప్​సెట్​ కలిగి ఉంది.

    iPhone 15 | భారీ డిస్కౌంట్

    అమెజాన్ తన యూజర్ల కోసం నిర్వహిస్తున్న ప్రైమ్ డే సేల్(Prime Day sale)లో ఐఫోన్ 15 అతి తక్కువ ధరలో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ మోడల్ ధర ఆపిల్ ఇండియా వెబ్​సైట్​ ప్రకారం రూ.69,900 ఉంది. నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉండే ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర అమెజాన్​లో రూ. 60,200గా చూపిస్తోంది. అయితే, ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు 128GB వేరియంట్​ను కేవలం రూ. 57,249కి (బ్యాంక్ ఆఫర్ తో కలిపి) పొందవచ్చు. పాత పరికరాలను మార్పిడి చేసుకోవాలనుకునే వారికైతే రూ. 52 వేలకే వస్తుంది. ఇక, ఈఎంఐలో తీసుకున్నా, బ్యాంక్ క్రెడిట్ కార్డు​లను (Amazon Pay ICICI Bank credit card) ఉపయోగించి కొనుగోలు చేసినా అదనంగా 5 శాతం తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు.

    iPhone 15 | స్పెసిఫికేషన్లు

    ఐఫోన్ 15 గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్​ను కలిగి ఉంది. IP68 రేటింగ్​ను కలిగి ఉన్న ఈ వేరియంట్. నీళ్లలో పడినా ఫోన్ కు ఏమీ కాదు.. స్మార్ట్ ఫోన్ డాల్బీ విజన్ సపోర్టుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా OLED డిస్​ప్లే కలిగి ఉంది, అదనపు రక్షణ కోసం డిస్​ప్లే సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఏర్పాటు చేశారు. ఈ మోడల్ ఆపిల్ A16 బయోనిక్ చిప్​సెట్​ ద్వారా శక్తిని పొందుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, ఇది 48, 12 మెగాపిక్సెల్ తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో ఉన్న 3349mAh బ్యాటరీ ఇది 15W ఫాస్ట్ చార్జింగ్​కు సపోర్టు చేస్తుంది.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....