అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ASI Promotions | నిజామాబాద్ (Nizamabad) కమిషనరేట్ పరిధిలో పలువులు ఏఎస్సై(ASI)లకు పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఏఎస్సైలకు సబ్ ఇన్స్పెక్టర్ (SI)గా ప్రమోషన్ కల్పించారు. బోధన్ రూరల్ పీఎస్‌లో పని చేస్తున్న నాగభూషణంకు ఎస్సైగా ప్రమోషన్ కల్పించి నిర్మల్ జిల్లాకు పంపించారు. మాక్లూరు ఠాణాలో పని చేస్తున్న పి నర్సయ్యను నిర్మల్ జిల్లాకు పదోన్నతిపై పంపించారు. నిజామాబాద్ త్రీ టౌన్ ఏఎస్సై బీ లీలాకృష్ణకు ఎస్సైగా ప్రమోషన్ ఇచ్చి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.
ఇటీవల హెడ్ కానిస్టేబుల్ (Head Constable) నుంచి ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన తొమ్మిది మందికి తాజాగా సీపీ కమిషరేట్ పరిధిలో పోస్టింగ్ ఇచ్చారు. హెడ్ కానిస్టేబుళ్లు రియాజుద్దీన్, డి.జక్రయ్య, కె.పరమేశ్వర్, పి.వసంత్‌రావు, కె.అరుణ కుమారి, జి.అనురాధ, జీవీ రమణేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్‌కుమార్ ఏఎస్సైలుగా ప్రమోషన్ పొందారు.