ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | ట్రేడ్‌ డీల్‌ ముందు అనిశ్చితి.. రోజంతా కొనసాగిన ఊగిసలాట.. చివరికి ఫ్లాట్‌గా...

    Stock Markets | ట్రేడ్‌ డీల్‌ ముందు అనిశ్చితి.. రోజంతా కొనసాగిన ఊగిసలాట.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | అమెరికా, భారత్‌ మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) ఈ రోజు ప్రకటించే అవకాశాలు ఉండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 34 పాయింట్లు, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో ట్రేడిరగ్‌ ప్రారంభించాయి.

    సెన్సెక్స్‌ 83,262 నుంచి 83,516 పాయింట్ల మధ్య, నిఫ్టీ(Nifty) 23,407 నుంచి 23,489 పాయింట్ల మధ్య కదలాడాయి. సూచీలు రోజంతా స్వల్ప లాభనష్టాలతో కొనసాగడం గమనార్హం. చివరికి సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 83,442 వద్ద, నిఫ్టీ క్రితం ట్రేడిరగ్‌ సెషన్‌ స్థాయి అయిన 25,461 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌తోపాటు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో రూపాయి(Rupee) మారకం విలువపై ఒత్తిడి నెలకొంది. దీంతో 20 పైసలవరకు తగ్గింది. భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిని ఈరోజు రాత్రి ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,707 కంపెనీలు లాభపడగా 2,364 స్టాక్స్‌ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 156 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 59 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 16 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Markets | మిశ్రమంగా సూచీలు

    ప్రధాన సూచీలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 1.50 శాతం పెరగ్గా.. యుటిలిటీ 0.71 శాతం లాభపడిరది. టెలికాం సూచీ 1.24 శాతం, ఐటీ 0.74 శాతం, కమోడిటీ 0.66 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.60 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.44 శాతం నష్టపోయాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.01 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.33 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.15 శాతం నష్టాలతో ముగిశాయి.

    Stock Markets | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో 18 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌ 3.01 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.07 శాతం, ట్రెంట్‌ 0.94 శాతం, రిలయన్స్‌ 0.90 శాతం, ఐటీసీ 0.87 శాతం లాభపడ్డాయి.

    Stock Markets | Top losers..

    బీఈఎల్‌ 2.46 శాతం, టెక్‌ మహీంద్రా 1.83 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.28 శాతం, మారుతి 1.07 శాతం, ఎటర్నల్‌ ఒక శాతం నష్టపోయాయి.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...