ePaper
More
    Homeఅంతర్జాతీయంFood Delivery Agent | ప్రఖ్యాత యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీహెచ్‌డీలు.. ఉద్యోగం దొర‌క్క డెలివ‌రీ బాయ్‌గా..

    Food Delivery Agent | ప్రఖ్యాత యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీహెచ్‌డీలు.. ఉద్యోగం దొర‌క్క డెలివ‌రీ బాయ్‌గా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Food Delivery Agent | ఈ రోజుల్లో పెద్దపెద్ద డిగ్రీలు చ‌దివినా ఉద్యోగం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. దీంతో కూటి కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డాల్సిన ప‌రిస్థితి. చైనా(China)కు చెందిన 39 ఏళ్ల డింగ్ యువాన్ఝావో అనే వ్యక్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అత్యున్నత విద్యార్హతలు పొందిన ఈ వ్యక్తి ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా (Food Delivery Agent) పనిచేస్తుండడం అంద‌రికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, వివిధ రంగాల్లో గౌరవనీయమైన పీహెచ్‌డీ పట్టాలు పొందిన డింగ్ యువాన్ఝావో ఇప్పుడు తాను చేసే ప‌నిలో సంతోషం వెతుక్కుంటున్నాడు. ఇదేమి చెడ్డ ప‌ని కాద‌ని చెబుతున్నాడు.

    Food Delivery Agent | ప‌నితో పాటు వ్యాయామం కూడా..

    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనం ప్రకారం, డింగ్ యువాన్ఝావో విద్యాబోధనను చైనా, సింగపూర్, యూకే లాంటి దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో పూర్తి చేశాడు. చైనాలోని సింఘువా యూనివర్సిటీ(Tsinghua University) నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్, పెకింగ్ యూనివర్సిటీ నుండి ఎనర్జీ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ(Engineering Masters Degree)లను సంపాదించాడు. ఆపై సింగపూర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. అంతే కాదు, బ్రిటన్‌లోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలో బయోడైవర్సిటీ రంగంలో మరొక డిగ్రీ కూడా పొందిన ఆయన విద్యా ప్రస్థానం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే అన్ని విద్యార్హతలు, ప్రతిభ ఉన్నప్పటికీ డింగ్‌కు సరైన ఉద్యోగం దొరకలేదు. వందల ఇంటర్వ్యూలకు హాజరైనా కూడా మంచి సంపాదించలేక నిరాశ చెందిన ఆయన కొంతకాలం సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్‌(Postdoctoral Researcher)గా పని చేసినప్పటికీ, ఆ తర్వాత ఉపాధి సమస్యల కారణంగా ఉద్యోగం కోల్పోయి ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారారు.

    ప్రస్తుత ఉద్యోగంపై డింగ్ యువాన్ఝావో ఎంతో సానుకూలంగా స్పందించాడు. “ఫుడ్ డెలివరీ ఉద్యోగం నాకు ఆదాయం ఇస్తుంది. దీని వల్ల నా కుటుంబాన్ని సంరక్షించగలుగుతున్నాను. కష్టపడి పనిచేస్తే జీవితాన్ని నేరుగా మెరుగుపర్చుకోవచ్చు. ఇది చెడ్డ పని కాదు, వ్యాయామం కూడా అవుతుంది. నేను చేస్తున్న పని ద్వారా సమాజానికి కూడా సేవ చేస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. అయితే డింగ్ స్టోరీ తెలుసుకున్న నెటిజ‌న్స్ ఆయ‌న‌కు సానుభూతి వ్యక్తం చేస్తూ, అంత పెద్ద విద్యాబోధన ఉన్నా కూడా ఉద్యోగం రావడం లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది. డింగ్ చూపిన ధైర్యం, నిజాయితీ మరియు కృషి మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంద‌ని అంటున్నాడు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...