ePaper
More
    HomeతెలంగాణCM Delhi Tour | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్​రెడ్డి.. ఎందుకో తెలుసా..!

    CM Delhi Tour | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్​రెడ్డి.. ఎందుకో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :CM Delhi Tour | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. రాజేంద్రనగర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం(Vana Mahotsavam) కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన శంషాబాద్​ ఎయిర్​ పోర్టు(Shamshabad Airport) నుంచి ఢిల్లీ వెళ్లారు. హస్తినలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు.

    CM Delhi Tour | రెండు రోజులపాటు అక్కడే..

    సీఎం రేవంత్​రెడ్డి రెండు రోజులు ఢిల్లీ(Delhi)లోనే మకాం వేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక మెట్రో రెండో దశ పనులు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్​లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విపక్షాలు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం(State Government) మూసీ నది సుందరీకరణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మెట్రో సెకండ్​ ఫేజ్​తో పాటు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్​ల గురించి సీఎం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులతో పాటు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు.

    ఇటీవల కేంద్ర ప్రభుత్వం(Central Government) పుణెలో మెట్రో కోసం భారీగా నిధులు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎప్పటి నుంచో కోరుతున్న మెట్రో సెకండ్​ ఫేజ్​ గురించి కేంద్ర మంత్రివర్గం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్ట్​ గురించి చర్చించనున్నారు. మెట్రోకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరననున్నారు. అలాగే సీఎం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్​ రింగ్​ రోడ్డు(RRR) కు నిధులు, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించనున్నారు.

    CM Delhi Tour | బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తారా..

    రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించింది. అయితే ఈ బిల్లులు కేంద్రం ఆమోదిస్తేనే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో సెప్టెంబర్​ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు(High Court) ఆదేశించిన విషయం తెలిసిందే. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బీసీ బిల్లులకు ఆమోదం లభిస్తేనే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. మరి సీఎం తన పర్యటనలో ఈ బిల్లుల ఆమోదం గురించి చర్చిస్తారా లేదా అనేది స్పష్టత లేదు.

    CM Delhi Tour | యూరియా కొరతపై..

    ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్నదాతలు యూరియా ఇతర ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో యూరియా కొరతతో పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కోటా పూర్తిగా రాలేదని ఇటీవల మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు(Minister Tummula Nageswara Rao) కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda)కు లేఖ రాసిన విషయం తెలిసిందే. యూరియా కొరతపై సైతం సీఎం రేవంత్​రెడ్డి కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ కానున్నట్లు తెలిసింది.

    CM Delhi Tour | పార్టీ పెద్దలను కలవనున్న సీఎం

    కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను సైతం రేవంత్​రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన హైకమాండ్​కు వివరించనున్నారు. ఇటీవల కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge) హైదరాబాద్​కు వచ్చారు. ఆయన పర్యటన రేవంత్‌ ఢిల్లీ వెళ్తుండడంతో ప్రాధాన్యత నెలకొంది. అలాగే రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా రేషన్​ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) కొత్త రేషన్​ కార్డుల పంపిణీని ఈ నెల 14న ప్రారంభించనుంది. సీఎం రేవంత్​రెడ్డి తుంగతుర్తితో రేషన్​ కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సీఎం ఆహ్వానించనున్నట్లు సమాచారం. రానున్న స్థానిక ఎన్నికలపై కూడా అధిష్టానంతో ఆయన చర్చించనున్నారు.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...