ePaper
More
    HomeతెలంగాణIAS Transfers | ఇక కలెక్టర్ల వంతు.. వారి బదిలీ ఖాయం..!

    IAS Transfers | ఇక కలెక్టర్ల వంతు.. వారి బదిలీ ఖాయం..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IAS Transfers | రాష్ట్రంలో అతిత్వరలో పలువురు కలెక్టర్ల బదిలీ(Collector transfers) జరుగనుంది. ఐఏఎస్​ల బదిలీలకు(IAS Transfers) సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పనితీరు బాగాలేని పలువురు జిల్లా కలెక్టర్ల తీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth reddy) తాజాగా కలెక్టర్లతో జరిపిన సమీక్షలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం కొత్త చీఫ్ సెక్రటరీగా కె.రామకృష్ణారావును(New CS Ramakrishna rao) ప్రభుత్వం నియమించింది. ఆ వెంటనే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ప్లే జిల్లాల కలెక్టర్ల బదిలీలు(IAS Transfers) కూడా ఉండవచ్చని ప్రచారం జోరందుకుంది.

    రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు పేరుతో(Six guarantees) ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses), నూతన రేషన్​ కార్డులు(New ration cards), ఐదు వందలకే గ్యాస్​ సిలిండర్​, రైతు రుణమాఫీ(Rythu runa mafi) తదితర కీలక నిర్ణయాలను తీసుకున్నప్పటికీ.. ఇంకా తమకు పథకాలు అందలేదంటూ పలువురు అర్హులు రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్నారు. జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వినతులు ఇస్తున్నప్పటికీ పరిష్కారం కావట్లేదని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు.

    అలాగే పలు జిల్లాల్లో పనిచేస్తున్న ఐఏఎస్​లపై మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో మారు రాష్ట్రంలో ఐఏఎస్​ల బదిలీ(IAS Transfers) అనివార్యమైంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తిరగని ఐఏఎస్​ల చిట్టా తయారు చేసినట్లు సమాచారం. వీరిలో ఉత్తర తెలంగాణ(North Telangana) నుంచే ఏకంగా నాలుగు జిల్లాల కలెక్టర్లు ఉండడం గమనార్హం. దాదాపు 15 మంది ఐఏఎస్​ల ట్రాన్స్​ఫర్స్(IAS Transfers)​ జరగవచ్చని తెలుస్తోంది. అయితే నూతన సీఎస్​ బాధ్యతలు చేపట్టిన త్వరాత ఈ ప్రక్రియ జరుగుతుందా లేదా.. అంతకుముందే పుతవుతుందా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....