ePaper
More
    HomeతెలంగాణVana Mahotsavam | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు : సీఎం రేవంత్​రెడ్డి

    Vana Mahotsavam | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు : సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Vana Mahotsavam | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సంబంధించి త్వరలో మహిళా రిజర్వేషన్లు(Womens Reservation) అమలులోకి వస్తాయన్నారు. హైదరాబాద్​ రాజేంద్ర నగర్​లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం(Vana Mahotsavam) కార్యక్రమాన్ని సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

    సీఎం(CM Revanth Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు 153కు పెరుగుతాయని అందులో 51 సీట్లు మహిళలకు రిజర్వ్​ అవుతాయని పేర్కొన్నారు. ఇల్లు నడిపుతున్న మహిళలు రాజ్యాన్ని కూడా నడపగలరన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

    Vana Mahotsavam | ప్రతి ఇంట్లో రెండు మొక్కలు నాటాలి

    పిల్లలను పెంచి పెద్ద చేసే తల్లులకు మొక్కలు పెంచడం కష్టం కాదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ప్రతి ఇంటి పెరటిలో మహిళలు రెండు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వనమే మనం.. మనమే వనం అని ఆయన అన్నారు. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అటవీ శాఖ(Forest Department) ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కోరారు.

    Vana Mahotsavam | మహిళలను కోటీశ్వరులను చేస్తాం

    రాష్ట్రంలోని మహిళలను మహిళా సంఘాల్లో చేర్చి కోటీశ్వరులను చేస్తామని సీఎం పేర్కొన్నారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్​ యూనిట్లు(Solar units) ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామన్నారు.

    బీఆర్​ఎస్​ హయాంలో మహిళలను పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లు మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడుతామని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మహిళలు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...