అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో ఈనెల 30న నిర్వహించే మహనీయుల జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకుడు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని తాలూకా రైస్‌మిల్ అసోసియేషన్‌లో Rice Mill Association మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటిసారిగా పెద్దఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఈశ్వర్, రవికుమార్, వెంకటి, పాండు, సూర్యకాంత్, దేవేందర్, స్వామి, రాహుల్, సురేందర్ తదితరులు ఉన్నారు.