ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mahesh Babu | రియల్ ఎస్టేట్ మోసం కేసులో మహేశ్‌బాబుకు నోటీసులు.. విచార‌ణకు హాజ‌రు కావాల‌ని...

    Mahesh Babu | రియల్ ఎస్టేట్ మోసం కేసులో మహేశ్‌బాబుకు నోటీసులు.. విచార‌ణకు హాజ‌రు కావాల‌ని ఆదేశం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mahesh Babu : టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో(star hero) మహేశ్‌బాబు (Mahesh babu) ఓ రియల్ ఎస్టేట్ మోసం కేసులో చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్‌(Hyderabad)కు సమీపంలోని బాలాపూర్‌లో ఒక వెంచర్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ (Rangareddy District Consumer Commission) నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంలో ఆయనను మూడో ప్రతివాదిగా పేర్కొనడం గమనార్హం.

    హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలు మరో వ్యక్తి కలిసి ‘మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్’ (Sai Surya Developers) అనే సంస్థపై వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. సంస్థపై నమ్మకంతో బాలాపూర్ గ్రామంలో ఉండే వెంచర్‌లో చెరో ప్లాట్ కొనుగోలు చేయడానికి ఇద్దరూ కలిపి దాదాపు రూ. 69.60 లక్షలు చెల్లించారు.

    Mahesh Babu : చిక్కుల్లో మ‌హేష్‌..

    బ్రోచర్‌లలో మహేశ్‌బాబు ఫొటోలు, “అన్ని అనుమతులతో కూడిన వెంచర్”, “భవిష్యత్తులో విలువ పెరిగే ప్రాజెక్ట్” వంటి హామీలను చూసి తాము ప్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత అక్కడ లేఅవుట్‌కు (Layout) అవసరమైన అనుమతులే లేవని, తాము మోసపోయినట్టు గ్రహించామ‌ని తెలిపారు.

    సంస్థ యజమాని కంచర్ల సతీష్‌ చంద్రగుప్తాను డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, అతను వాయిదాల పద్ధతిలో కేవలం రూ.15 లక్షల వరకు మాత్రమే తిరిగి చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తం కోసం పలుమార్లు కోరినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

    ఫిర్యాదును పరిశీలించిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్, ఈ కేసులో సాయి సూర్య డెవలపర్స్ సంస్థ, యజమాని సతీష్ చంద్రగుప్తా, మరియు ప్రచారకర్త మహేశ్‌బాబులను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది.

    నోటీసుల ప్రకారం, వారు సోమవారం వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించింది. కాగా.. ఓ రియల్ ఎస్టేట్ (real estate) సంస్థ కోసం ప్రచారం చేసినందుకు మహేశ్‌బాబుకు నోటీసులు రావడం సినీ పరిశ్రమ(film industry)లో కలకలం రేపుతోంది. మహేశ్‌బాబు చేసిన ప్రచార హామీలే తమకు నమ్మకాన్ని కలిగించాయని బాధితులు స్పష్టం చేస్తున్నారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...