ePaper
More
    Homeక్రీడలుIND vs ENG | ఇంగ్లండ్​పై భారత్ ఘన విజయం

    IND vs ENG | ఇంగ్లండ్​పై భారత్ ఘన విజయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IND vs ENG | ఇంగ్లండ్(England)​తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా(team India) అద్భుత విజయం సాధించింది. 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 336 పరుగుల భారీ తేడాతో గిల్ సేన విజయం సొంతం చేసుకుంది. 2 ఇన్నింగ్స్ ల్లో కలిపి గిల్ 430 పరుగులు చేయగా.. ఆకాశ్ దీప్ 10 వికెట్లు పడగొట్టి, ఇంగ్లండ్​ జట్టును ఘోరంగా దెబ్బతీశారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్​ను టీమిండియా 1-1తో సమం చేసింది.

    బర్మింగ్‌హమ్‌లో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ చివరి రోజు భారత్‌ India చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా, ఆటను తన చేతుల్లోకి తీసుకున్న భారత్​ ఆటగాళ్లు ఇంగ్లండ్‌ను ఓడించారు.

    IND vs ENG | ఆట ప్రారంభం అయినాక..

    ఆట ప్రారంభమైన వెంటనే ఆకాశ్ దీప్ (Akash Deep) (5 వికెట్లు, 58 పరుగులు) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ను తుడిచిపెట్టేశాడు. మొదట ఓలీ పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్, వెంటనే తన తదుపరి ఓవర్లో హ్యారీ బ్రూక్ (23)ను ఎల్బీగా ఔట్‌ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (35), జేమీ స్మిత్ (32 నాటౌట్) కాస్త రిస్క్‌ తీసుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను కొంతవరకే ఆందోళనకు గురిచేశారు.

    INDvsENG | విజయం లాంఛనమే..

    లంచ్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్లో స్టోక్స్ (England captain Ben Stokes) డిఫెన్స్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరగడంతో భారత్‌కు ఊరట లభించింది. 153 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరవ వికెట్ కోల్పోయింది. 199 పరుగులు వద్ద క్రిస్​ వోక్స్​ ఏడో వికెట్​ రూపంలో వెనుతిరిగాడు. 226 పరుగుల వద్ద జెమ్మి స్మిత్​ను అవుట్​ చేశాడు. వర్షం ఆటంకంగా మారినా, భారత బౌలర్లు త‌మ స‌త్తా చూపించారు. ప్రత్యేకించి ఆకాశ్ దీప్‌ స్పెల్ ఈ టెస్ట్‌లో మైలురాయిగా నిలిచింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...