ePaper
More
    HomeతెలంగాణMinor Girl | బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని .. పోలీసుల అదుపులో నిందితులు

    Minor Girl | బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని .. పోలీసుల అదుపులో నిందితులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minor Girl : మహబూబ్​నగర్​ జిల్లా (Mahabubnagar district) జడ్చర్లలో దారుణం చోటుచేసుకుంది. జడ్చర్ల (Jadcharla) పోలీస్​ స్టేషన్​ (police station) పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ బాలిక గర్భం దాల్చింది. కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఈ బాలికను పరిచయం చేసుకున్న ఇద్దరు యువకులు మాయమాటలు శారీరకంగా లొంగదీసుకున్నారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఇది జరిగి ఎనిమిది నెలలు అయింది.

    Minor Girl : మగబిడ్డకు జన్మ..

    హైదరాబాద్​(Hyderabad)లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి(government hospital)లో ఈ నెల 2న మగబిడ్డకు జన్మనిచ్చింది. చదువుకునే వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలిక ప్రస్తుతం తీవ్ర వేదనకు గురవుతోంది. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని మోసం చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

    Minor Girl : టీనేజ్​లో

    పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్​(INTER)లోకి అడుగు పెట్టిన పిల్లలు పెద్దవాళ్లమైనట్లు ఫీలవుతున్నారు. ఎంజాయ్​మెంట్​ కోరుకుంటున్నారు. తెలిసీతెలియని వయసులో ఆకర్షణకు లోనవుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. పండంటి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఉజ్వల భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. జీవితం చేతుల్లో నుంచి జారిపోయాక ఇబ్బందిపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం ఈ బాధిత బాలిక ఎదుర్కొంటోంది.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...