- Advertisement -
HomeతెలంగాణBheemgal mandal | గల్ఫ్‌ కార్మికుడికి అండగా సీఎంవో

Bheemgal mandal | గల్ఫ్‌ కార్మికుడికి అండగా సీఎంవో

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal mandal | ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కార్మికుడికి రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు బాధితుడికి మెరుగైన చికిత్స కోసం భారత్‌కు రప్పించాలని బాధితుడి తండ్రి ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించగా, ఈ మేరకు నోడల్‌ అధికారి దివ్యా దేవరాజన్‌ (nodal officer Divya Devarajan) స్పందించారు.

వివరాల్లోకి వెళితే.. భీమ్‌గల్‌ మండలం చేంగల్‌కు (Bheemgal mandal, Chengal) చెందిన ప్యాట్ల సాయిబాబా ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లగా, గత జూన్‌లో రియాద్‌ నుంచి దమ్మామ్‌కు స్వయంగా డ్రైవ్‌ చేస్తూ వెళ్తున్న క్రమంలో కారు టైరు పేలి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కాగా, అక్కడి ఆస్పత్రిలో చికిత్స చేసి డిశ్చార్జ్​ చేశారు. కాగా, మెరుగైన చికిత్స కోసం భారత్‌కు రప్పించాలని బాధితుడి తండ్రి గంగు ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించగా, ఈ మేరకు ఆదివారం తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం సమన్వయంతో హైదరాబాద్‌కు చేర్చారు.

- Advertisement -

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌ ఛైర్మన్​ మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్‌ అమెరికా విభాగం నాయకుడు బొజ్జ అమరేందర్‌ రెడ్డి బాధితుడిని పరామర్శించారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఈస్ట్రన్‌ రీజియన్‌ అధ్యక్షుడు రంజిత్‌ చిట్టలూరి, నాగార్జున బృందం ఆధ్వర్యంలో బాధితుడికి విమాన టికెట్లు, రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News