అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad District Court | సీనియర్ న్యాయవాది నరసింహారెడ్డి (Narasimha Reddy) అడిషనల్ పీపీగా (Additional PP) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (Special Chief Secretary) రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరసింహారెడ్డి మూడేళ్లు పనిచేయనున్నారు.
Nizamabad District Court | 40ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో..
నరసింహారెడ్డి నాలుగు దశబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాలో సీనియర్ న్యాయవాదుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. రూరల్ నియోజకవర్గంలోని (Rural constituency) అనంతగిరి గ్రామానికి చెందిన ఆయన జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా బార్ అసోసియేషన్(Bar Association) అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్‌రాజు తదితరులు అభినందనలు తెలిపారు.