ePaper
More
    HomeజాతీయంRajasthan | రూ.135 కోట్లతో ఫ్లైఓవర్​ నిర్మాణం.. ఒక్క వర్షానికి కుంగిన వైనం

    Rajasthan | రూ.135 కోట్లతో ఫ్లైఓవర్​ నిర్మాణం.. ఒక్క వర్షానికి కుంగిన వైనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | రాజస్థాన్​ (Rajasthan)లో రూ.135 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్​ ఒక్క వర్షానికి కుంగిపోయింది. ఏళ్ల పాటు మన్నికగా ఉండాల్సిన ఫ్లై ఓవర్​ ఒక్క వర్షానికి కుంగిపోవడంతో అధికారులు దానిని మూసివేశారు.

    రాజస్థాన్​లోని అజ్మీర్​లో ఇటీవల ఫ్లై ఓవర్​ నిర్మించారు. రూ.135 కోట్లతో నిర్మించిన ఈ వంతెనకు ప్రభుత్వం రామసేతు (Rama Setu) అని పేరు పెట్టింది. అయితే ఈ నెల 2న అజ్మీర్​లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ఫ్లైఓవర్ కుంగిపోయింది. దీంతో అధికారులు దానిని మూసేశారు. ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. అయితే అన్ని కోట్లు పెట్టి నిర్మించిన ఫ్లైఓవర్​ మూణ్నాళ్లకే కుంగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Rajasthan | ప్రభుత్వం సీరియస్​

    అజ్మీర్ స్మార్ట్ సిటీ (Ajmir Smart City) యోజనలో నిర్మించిన రామసేతు కుంగడంపై ప్రభుత్వం సీరియస్​ అయింది. ఈ మేరకు విచారణ కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ ఆదివారం ఫ్లై ఓవర్​ను తనిఖీ చేయనుంది. సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

    Rajasthan | నీట మునగడంతో..

    రాజస్థాన్​లో జూలై 2న కురిసిన భారీ వర్షం తర్వాత, రామసేతులోని సోనిజీకి నాసియన్ ముందు రోడ్డు మునిగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే రోడ్డు పనులు సక్రమంగా చేపట్టకపోవడంతోనే ఈ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.

    వంతెన తారు రోడ్డు నమూనాలను కూడా పరిశీలన కోసం సేకరించారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ RSRDC ప్యాచ్ వర్క్ చేయడం ద్వారా గుంతలను తాత్కాలికంగా పూడ్చింది. అయితే ఈ మరమ్మతులు సరిపోవని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కమిటీ నివేదిక అనంతరం చర్యలు చేపట్టనున్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...