అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప న్యాయవాది, విద్యావేత్త అని గుర్తు చేశారు. 33 ఏళ్ల వయసులో కొలకత్తా యూనివర్సిటీ (Calcutta University) వైస్ ఛాన్స్లర్గా పని చేశారని తెలిపారు. అఖిల భారతీయ హిందూ మహాసభల (All India Hindu Mahasabha) అధ్యక్షుడిగా సేవలందించి, దేశ మొదటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారన్నారు.
Mla Dhanpal | దేశ సమగ్రత ఐక్యత కోసం..
దేశ సమగ్రత ఐక్యత కోసం హిందువుల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో జనసంఘ్ (Jana Sangh) స్థాపించాడన్నారు. ఆయన ఆశయ లక్ష్యసాధనకు ప్రతీ కార్యకర్త పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు న్యాలం రాజు, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్, కస్తూరి కృష్ణ, నారాయణ యాదవ్, హరి తదితరులు పాల్గొన్నారు.