ePaper
More
    HomeతెలంగాణTelangana govt | ఇక 10 గంటల పని సమయం.. వాణిజ్య సంస్థల నిబంధనల్లో సడలింపు..

    Telangana govt | ఇక 10 గంటల పని సమయం.. వాణిజ్య సంస్థల నిబంధనల్లో సడలింపు..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana govt : తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) విధానాన్ని ప్రోత్సహించేందుకు అడుగులు వేసింది.

    రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలకు (షాపులను మినహాయించి) ఉద్యోగుల (employees) పని సమయానికి మినహాయింపులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం(జులై 8, 2025) నుంచి అమలులోకి రానున్నాయి.

    Telangana govt : తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం ప్రకారం..

    రోజుకు ఉద్యోగులు గరిష్ఠంగా 10 గంటలు, వారానికి 48 గంటల వరకు పనిచేయొచ్చు. కాగా, ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన భద్రతా ప్రమాణాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం..

    • రోజుకు గరిష్ఠంగా 10 గంటలు మాత్రమే పని.
    • వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే, ఓవర్‌టైమ్ వేతనం తప్పనిసరి ఇవ్వాలి.
    • 6 గంటలకుపైగా పని చేసిన వారికి కనీసం 30 నిమిషాల విరామం తప్పనిసరి కేటాయించాలి.
    • రోజువారీ మొత్తం పని సమయం 12 గంటలను మించకూడదు.
    • ఓవర్​ టైమ్​ విషయానికి వస్తే.. ప్రతి త్రైమాసికానికి గరిష్ఠంగా 144 గంటలు మాత్రమే అనుమతి.

    ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే మినహాయింపును రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...