అక్షరటుడే, ఆర్మూర్: Makloor BJP | రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని బీజేపీ(BJP) మాక్లూర్ మండలాధ్యక్షురాలు గంగోని మమత అన్నారు. ఆదివారం మాక్లూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతకుముందు పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడుల్లో (Terrorist attack) మృతి చెందిన వారికి నివాళులర్పించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి గంగోనె సంతోష్, సీనియర్ నాయకులు సురేష్ నాయక్, రాజు, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.