ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | ఫోన్లను అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత భద్రతకు భంగం

    SP Rajesh Chandra | ఫోన్లను అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత భద్రతకు భంగం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ఫోన్లను అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం ఏర్పడుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. పట్టణంలో శనివారం పోలీస్​ కార్యాలయంలో (Kamareddy Police office) మాట్లాడారు.

    బాధితులు పోగొట్టుకున్న సుమారు 130 ఫోన్లను రికవరీ చేశామని.. త్వరలోనే బాధితులకు అప్పగిస్తామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం మనం ఉపయోగించే మొబైల్​ ఫోన్లపై అశ్రద్ధ మంచిది కాదన్నారు. మొబైల్ రికవరీలలో (Mobile Recovery) రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

    SP Rajesh Chandra | ఫోన్​ చోరీకి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి

    మొబైల్ పోయినా.. చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్​కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోయిన సెల్​ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. 15 రోజుల్లో ఈ టీం 130 ఫోన్లను రికవరీ చేశారన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు అందజేస్తామని, బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి సంబంధిత వివరాలు చూపించి ఫోన్లు తీసుకుని వెళ్లాలని సూచించారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...