అక్షరటుడే, ఆర్మూర్: Alumni Friends | ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్(Zilla Parishad High School)లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1999-2000 బ్యాచ్ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరారు. విద్యార్థులు(Students) పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులను(Teachers) సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనసూయ, రాజేందర్, భూమయ్య, దామోదర్, నరసింహా, నరసింహారెడ్డి, భోజన్న, బాలయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
