ePaper
More
    HomeతెలంగాణNizamabad Collector | భూభారతితో సులభంగా భూసమస్యల పరిష్కారం

    Nizamabad Collector | భూభారతితో సులభంగా భూసమస్యల పరిష్కారం

    Published on

    అక్షరటుడే ఇందూరు: Nizamabad Collector | భూసమస్యలను సులభంగా పరిష్కరించేలా భూభారతి చట్టం రూపొందించబడిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) తెలిపారు. ఆదివారం నిజామాబాద్ నార్త్, సౌత్ (Nizamabad North, South) మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలో (Arsapalli) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణితో కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. నూతన ఆర్ఓఆర్ చట్టం (ROR Act) ద్వారా రైతులు సెక్షన్–4లోని సబ్ సెక్షన్–4, 5 ప్రకారం భూ రికార్డులను సవరణ చేసుకునే అవకాశం కల్పించామని సూచించారు.

    ఆర్డీవో.. కలెక్టర్ స్థాయిల్లో రెవెన్యూ కోర్టులు వెలువరించే ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ల్యాండ్ ట్రిబ్యునల్​ను (Land Tribunal) ఆశ్రయించవచ్చని, సీసీఎల్ఏకు (CCLA) రివిజన్ అధికారాలు సైతం కల్పించారని తెలిపారు. ఆధార్ తరహాలోనే.. భూధార్ (Bhudhar)సంఖ్య కేటాయిస్తారని, దీనివల్ల భూవివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్టపడుతుందని చెప్పారు. సదస్సులో ఇన్​ఛార్జి ఆర్డీవో స్రవంతి, సౌత్, నార్త్ తహశీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...