ePaper
More
    Homeఅంతర్జాతీయంPM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత పౌర...

    PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత పౌర పురస్కారం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి అరుదైన గౌరవం లభించింది. ట్రినిడాడ్ & టొబాగో (Trinidad & Tobago) అత్యున్నత పౌర పురస్కారం వరించింది. కరేబియన్ దేశం (Caribbean country) సందర్శనలో ఉన్న మోదీకి శుక్రవారం(జులై 4) ట్రినిడాడ్ & టొబాగో యొక్క అత్యున్నత పురస్కారం లభించింది.

    ప్రపంచ నాయకత్వం, భారతీయ ప్రవాసులతో చురుకైన సంబంధం, కొవిడ్ టైంలో మానవతావాద సహకారం.. తదితరాలను గుర్తించి, మోడీకి “ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ & టొబాగో” “The Order of the Republic of Trinidad & Tobago” ప్రదానం చేశారు. ఇలా ఒక విదేశీ నేతకు ఆ దేశం ఈ పురస్కారం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

    PM MODI | ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఏమన్నారంటే..

    “140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని నేను స్వీకరిస్తున్నా..” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్​ ట్రినిడాడ్ & టొబాగో మధ్య బలమైన స్నేహాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ పురస్కారాన్ని విలువలు, చరిత్ర, సాంస్కృతిక సంబంధాల ప్రతిబింబంగా వర్ణించారు.

    PM MODI | చారిత్రాత్మక పర్యటన..

    ట్రినిడాడ్ & టొబాగోలో ప్రధానమంత్రి మోదీకి ఇది మొదటి పర్యటన. 1999 తర్వాత ఆ దేశానికి భారత ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా భారత్​ ప్రైమ్​ మినిస్టర్​ మోదీకి ఈ అవార్డును ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేసర్ (Prime Minister Kamla Persad-Bissessar) ప్రకటించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...