Manik Bhavan | అభివృద్ధి చూసి ఓటేయ్యండి.. సభ్యులకు అధ్యక్ష అభ్యర్థి విన్నపం
Manik Bhavan | అభివృద్ధి చూసి ఓటేయ్యండి.. సభ్యులకు అధ్యక్ష అభ్యర్థి విన్నపం

అక్షరటుడే, ఇందూరు : Manik Bhavan : గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మాణిక్ భవన్ పాఠశాల ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) (Sri Nutan Vaishya High School) కార్యవర్గం అధ్యక్ష అభ్యర్థి ఇంగు శివప్రసాద్ కోరారు. నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Manik Bhavan : సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు..

గతంలో రెండు సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు శివప్రసాద్​ చేపట్టామన్నారు. ఇప్పటికే పాత భవనాలను మరమ్మతులు చేయించి పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థుల ఉన్నతికి, పేద వైశ్య విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

Manik Bhavan : ఈ నెల 6న ఎన్నికలు..

సభ్యులు ఈ నెల 6న మాణిక్ భవన్ పాఠశాల Manik Bhavan School లో జరిగే సంఘం ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. తమ బ్యాలెట్ నెంబర్ 1 కి ఓటేసి, తమ ప్యానెల్​ను గెలిపించాలన్నారు. సమావేశంలో వైశ్య ప్రతినిధులు రాజశేఖర్, సతీష్ కుమార్, అరుణ్ కుమార్, రాఘవేంద్ర, వీరేందర్, సత్యప్రసాద్, శ్రీనివాస్, హరీష్ కుమార్, శ్రీధర్ గుప్తా, దీకొండ యశ్వంత్, పవన్ కుమార్, వెంకన్న, పాల్తి శ్రీనివాస్, రజినీకాంత్, సతీష్, విట్టల్, అమరేందర్ పాల్గొన్నారు.