అక్షరటుడే, వెబ్డెస్క్: Srisailam Temple | శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామిని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారిని చూసి తరిస్తారు. అంతేగాకుండా స్వామి వారి స్పర్శ దర్శనం కోసం ఎంతో మంది పరితపిస్తారు. అయితే ప్రస్తుతం సామాన్య భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం అమలు చేస్తున్నాయి. అయితే ఒకేసారి భక్తులు అధికంగా వస్తుండడంతో స్పర్శ దర్శనంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఆలయ అధికారులు స్పర్శ దర్శనానికి (Sparsha Darshan) టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో టోకెన్ తీసుకున్న వారికే స్పర్శ దర్శనం అనుమతి ఉంటుంది. దీంతో భక్తుల రద్దీ తగ్గడంతో పాటు ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జులై 1 నుంచి ఆలయంలో స్పర్శ దర్శనం పున:ప్రారంభించారు. భక్తులు నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఆన్‌లైన్‌లో టోకెన్లు (Online Tokens) జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం అమలు చేస్తామన్నారు.
వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు వివరించారు. ఇటీవల స్పర్శ దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో ఆన్లైన్ టోకెన్ జారీ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. భక్తులు www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా స్పర్శ దర్శనం టోకెన్లు ఉచితంగా పొందవచ్చు.