అక్షరటుడే, వెబ్డెస్క్:Weather | తెలంగాణలో గత కొద్దిరోజులు ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్నాయి. రానున్న నాలురోజుల పాటు ఎండలు మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ(Meteorological Department) పేర్కొంది. ఇందులో భాగంగా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) ఇచ్చింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, సహా 16 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
