అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly | రాష్ట్ర అసెంబ్లీ (Assembly) మీడియా సలహా మండలి ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Prasad) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ (KarimNagar) జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి 16 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
మొత్తం 15 మందితో ఏర్పాటు చేసిన మీడియా సలహా మండలిలో కో ఛైర్మన్‌గా పోలోజు పరిపూర్ణాచారి, సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులైన అయితరాజు రంగారావు, బొడ్లపాటి పూర్ణచంద్రారావు, ఎల్ వెంకట్రాం రెడ్డి, పొలంపల్లి ఆంజనేయులు, ఎం పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీమ్ వజాహత్, బసవపున్నయ్య, ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బీహెచ్ఎంకే గాంధీ నియమితులయ్యారు.