Yoga Association | యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో డీవైఎస్​వోకు సన్మానం
Yoga Association | యోగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో డీవైఎస్​వోకు సన్మానం

అక్షరటుడే, ఇందూరు: Yoga Association | జిల్లా యువజన, క్రీడా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్​ను (DYSO Pavan Kumar) శుక్రవారం యోగా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.

Yoga Association | క్రీడాభివృద్ధికి కృషి చేయాలి

జిల్లాల్లో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని యోగా అసోసియేషన్​ ప్రతినిధులు కోరారు. నగరంలో సరైన క్రీడాస్థలం లేదని.. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వపరంగా జిల్లాకు కావాల్సిన సౌకర్యాలు అందించే విధంగా చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో న్యాయవాది రాజ్​కుమార్​ సుబేదార్ (Advocate Rajkumar Subedar), ఎక్సైజ్ సీఐ నగేష్(Excise CI Nagesh), అధ్యక్షురాలు ఐశ్వర్య, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కార్యదర్శి గంగాధర్, కోశాధికారి కమలావాణి, లోహిదాస్, సంగీత తదితరులు పాల్గొన్నారు.