అక్షరటుడే, ఇందూరు: Chaitanya Techno School | నగర శివారులోని గూపన్పల్లిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శుక్రవారం స్మార్ట్ లివింగ్ (Smart Living) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ ఈశ్వర్, ఇన్ఛార్జి శివకుమార్, సీ బ్యాచ్ ఇన్ఛార్జి శశిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Sri Chaitanya Techno School | సమాజం పట్ల బాధ్యత ఉండాలి
విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యతను నేర్పించడం స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులను క్రమశిక్షణతో పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ ఈశ్వర్, ఇన్ఛార్జి శివకుమార్, సీ బ్యాచ్ ఇన్ఛార్జి శశిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.