Seeds Shops
Seeds Shops | విత్తన దుకాణాల్లో తనిఖీలు

అక్షరటుడే, గాంధారి: Seeds Shops | మండలంలోని పలు విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖ (Department of Agriculture), పోలీసు శాఖ (Police Department) ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ అధికారులు నదీం, రాజలింగంతో పాటు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించినవారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Seeds Shops | రశీదులు తీసుకోవాలి..

రైతులు ఫర్టిలైజర్​ దుకాణాల్లో (Fertilizer Stores) మందులు తీసుకున్న అనంతరం తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని వ్యవసాయ, పోలీసు శాఖ​ల అధికారులు సూచించారు. ఎరువులు తీసుకున్న తర్వాత రశీదులు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. విత్తన దుకాణాదారులు సైతం కమీషన్లకు ఆశపడి నాణ్యతలేని వంగడాలను రైతులకు అంటగట్టవద్దని సూచించారు.