ePaper
More
    Homeఅంతర్జాతీయంB-2 Bombers | ఆ విమానాలు ఏమయ్యాయి..? ఇరాన్​పై దాడి తర్వాత తిరిగి రాని...

    B-2 Bombers | ఆ విమానాలు ఏమయ్యాయి..? ఇరాన్​పై దాడి తర్వాత తిరిగి రాని బీ-2 విమానాల బృందం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: B-2 Bombers | ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం చేపట్టిన బాంబు దాడి ఊహించని మలుపు తిరిగింది. ఇందులో పాల్గొన్న B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లలో (B-2 Spirit Stealth Bombers) ఒక బృందం స్థావరానికి తిరిగి రాలేదు. దాని ఆచూకీ తెలియక పోవడంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇరాన్​పై దాడికి జూన్ 21న మిస్సోరీ(Missouri)లోని వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా రెండు వేర్వేరు B-2 బాంబర్ల బృందాలను మోహరించింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పుదారి పట్టించేందుకు ఒక బృందం పసిఫిక్ మీదుగా పశ్చిమ దిశగా ప్రయాణించింది. ఏడు B-2లతో కూడిన రెండవ బృందం టెహ్రాన్​లోని ఫోర్డో(Tehran Fordow), నటాంజ్​లోని భూగర్భ అణు కేంద్రాలపై దాడి చేయడానికి తూర్పు వైపునకు వెళ్లింది. సదరు స్ట్రైక్ బృందం తన మిషన్​ను పూర్తి చేసి, 37 గంటల నిరంతర ప్రయాణం తర్వాత స్థావరానికి తిరిగి వచ్చింది. కానీ పసిఫిక్ వైపు ప్రయాణించిన డెకాయ్ బృందం జాడ తెలియకుండా పోయింది.

    B-2 Bombers | హవాయిలో కనిపించిన బీ-2

    బీ-2 బాంబర్ల బృందం కనిపించకుండా పోయిన ఉదంతంపై అమెరికా(America) నుంచి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఆ బృందంలోని ఓ విమానం ఆచూకీ తాజాగా లభ్యం కావడం చర్చనీయాంశమైంది. పశ్చిమ వైపు ప్రయాణించిన బీ-2 విమానాల బృందంలోని ఓ విమానం హవాయిలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోనోలులులోని హికామ్ ఎయిర్ ఫోర్స్ బేస్తో రన్వేలను పంచుకునే డేనియల్ కె.ఇనోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టెల్త్ బాంబర్ దిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టు(Airport)లో పార్కింగ్ చేసిన ఉన్న బీ-2 బాంబర్ వీడియో ఆన్​లైన్​లో వైరల్ అయింది. అయితే, అమెరికా వెళ్లాల్సిన ఈ విమానం ఎందుకు ఇక్కడ ల్యాండ్ అయిందన్న దానికి గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

    అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన బీ-2 బాంబర్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏప్రిల్ 2023లో కూడా హవాయిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ (Emergency Landing) అయింది. 2022లో మిస్సౌరీలో జరిగిన ప్రమాదం తర్వాత మొత్తం B-2 విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. 2008లో ఓ బీ-2 బాంబర్ తీవ్ర ప్రమాదానికి గురైంది. గ్వామ్ లోని అండర్సన్ వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే “స్పిరిట్ ఆఫ్ కాన్సాస్”(Spirit of Kansas) కూలిపోయింది. అయితే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...