ePaper
More
    HomeసినిమాHero Prabhas | మంచి మనసు చాటుకున్న ప్రభాస్​.. ఫిష్ వెంకట్ ఆప‌రేష‌న్ కోసం రూ.50...

    Hero Prabhas | మంచి మనసు చాటుకున్న ప్రభాస్​.. ఫిష్ వెంకట్ ఆప‌రేష‌న్ కోసం రూ.50 లక్ష‌లు ఇస్తానన్న రెబల్​ స్టార్​..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hero Prabhas | తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఫిష్ వెంక‌ట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి, తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆది,చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, ఢీ, రెడీ, గబ్బర్ సింగ్, బలుపు, ఆంజనేయులు, మిరపకాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో ఆయన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో గుర్తింపు పొందిన వెంకట్, మంచి అవ‌కాశాలు అందిపుచ్చుకున్నారు. అయితే ఈ మ‌ధ్య ఆయ‌న ఆరోగ్యం ఏమంత బాగోలేక‌పోవ‌డంతో సినిమాల‌కి దూరంగా ఉన్నారు.

    Hero Prabhas | కిడ్నీ మార్చాల్సిందే..

    వెంకట్(Fish Venkat) గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయ‌న పరిస్థితి మరింత విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌(Ventilator)పై చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఎదుటివారిని కూడా గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో ఉన్నార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. అయితే ఆసుప‌త్రి ఖ‌ర్చులు భ‌రించ‌లేక‌పోతున్న కుటుం స‌భ్యులు త‌మ‌కి సాయం చేయాలంటూ మీడియా ద్వారా కోరుతున్నారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూ.2ల‌క్ష‌ల రూపాయ‌లు సాయం చేసిన విష‌యం తెలిసిందే.

    అయితే ఇప్పుడు ప్ర‌భాస్ రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. రీసెంట్‌గా ప్ర‌భాస్ (Hero Prabhas) అసిస్టెంట్ వెంక‌ట్ కూతురికి కాల్ చేసి దాత‌లు ఎవ‌రైన ఉంటే ఆప‌రేష‌న్‌కి ఏర్పాటు చేసుకోండి. దానికి అయ్యే ఖ‌ర్చుకి డ‌బ్బు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని ఫిష్ వెంక‌ట్ కూతురు మీడియాకి తెలియ‌జేసింది. ఇప్పుడు వెంక‌ట్ బ్ర‌త‌కాలంటే కిడ్నీ మార్పిడి(Kidney Transplant) చేయాల్సిందేన‌ట‌. మా ఇంట్లో వారి బ్ల‌డ్‌తో నాన్న‌ది మ్యాచ్ కావ‌డం లేదు. అందుకే దాత‌ల కోసం చూస్తున్నామంటూ వెంక‌ట్ కూతురు పేర్కొంది. కాగా, నాలుగేళ్ల క్రితం మద్యం వల్ల షుగర్, కాలు ఇన్‌ఫెక్షన్‌ వంటి ఆరోగ్య సమస్యలు త‌లెత్త‌గా ఆ స‌మ‌యంలో ప‌లువురు సినీ ప్రముఖులు, దాతలు సాయం చేయ‌డంతో ప్రాణాలు దక్కాయి. తిరిగి మద్యం, ధూమపానం చేస్తుండ‌డం వ‌ల‌న తిరిగి ఈ దుస్థితి వచ్చిందని ఆయన భార్య వాపోయారు. తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి అల‌వాటు చేశార‌ని, ఇప్పుడు ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు ఒక్క‌రు రావ‌డం లేద‌ని పేర్కొంది.

    More like this

    MLA Raja Singh | పార్టీని ఆయనే నాశనం చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Raja Singh | గోషామహాల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (Goshamahal MLA Raja Singh) మరోసారి...

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....