ePaper
More
    Homeఅంతర్జాతీయంIndian Products | అక్ర‌మ మార్గాల్లో పాక్‌కు భార‌త ఉత్ప‌త్తులు.. 10 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా...

    Indian Products | అక్ర‌మ మార్గాల్లో పాక్‌కు భార‌త ఉత్ప‌త్తులు.. 10 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌స్తువుల త‌ర‌లింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian Products | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack)తో భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న శ‌త్రుదేశాన్ని అష్ట‌దిగ్బంధనం చేసేందుకు కేంద్రం అన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆదేశంతో వాణిజ్య సంబంధాల‌ను (Trade relations) తెంపేసుకుంది.

    అయితే, పొరుగు దేశంతో ప‌రిమిత స్థాయిలో వాణిజ్యం కొన‌సాగుతుండ‌గా, ప్ర‌త్యామ్నయ మార్గాల్లో పాక్ మ‌న ఉత్ప‌త్తుల‌ను భారీగా దిగుమ‌తి చేసుకుంటోంది. ఏటా ప‌ది బిలియ‌న్ డాల‌ర్ల‌కు(Billions Dollars) పైగా విలువైన భార‌త వ‌స్తువుల‌ను ప్ర‌త్యామ్న‌మ మార్గాల్లో పొరుగు దేశానికి చేరుకుంటున్నాయ‌ని తాజాగా వెలుగు చూసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) వాణిజ్య డేటా ప్రకారం. సంవత్సరానికి 10 బిలియన్ డాల‌ర్ల‌కు పైగా విలువైన భారతీయ వస్తువులు వేర్వేరు మార్గాల ద్వారా పాకిస్తాన్‌(Pakistan)కు చేరుకుంటున్నాయని తేలింది.

    Indian Products | దుబాయ్‌, సింగ‌పూర్ మీదుగా..

    భార‌త్‌(India)కు పాకిస్తాన్‌తో ప‌రిమిత స్థాయిలోనే వాణిజ్యం చేసుకునే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో పొరుగు దేశం ప్ర‌త్యామ్నయ మార్గాల్లో మ‌న ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది. భారతదేశం ఎగుమ‌తి(Export) చేసే వ‌స్తువుల‌ను రవాణా చేయడానికి దుబాయ్ dubai, సింగపూర్ singapoor, కొలంబోలోని colombo మధ్యవర్తిత్వ పోర్టులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.

    ఈ ఓడరేవులు కీలకమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ (Transshipment) పాయింట్లుగా పనిచేస్తాయి, భార‌త్‌, పాక్ మధ్య వాణిజ్య పరిమితులు ఉన్నప్పటికీ, భార‌త‌ ఎగుమ‌తులు శ‌త్రు దేశానికి చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఇక్క‌డే లేబుళ్లు(Labels) మార్చి పాక్‌కు త‌ర‌లిస్తుంటారు. జీటీఆర్ఐ(GTRI) అంచనా ప్రకారం.. ఏటా 10 బిలియన్ డాల‌ర్ల‌కు పైగా విలువైన భారతీయ వస్తువులు ఈ మార్గం ద్వారా పాకిస్తాన్‌కు చేరుకుంటున్నాయ‌ని అంచ‌నా.

    Indian Products | లేబుళ్లు మార్చ‌డం ద్వారా..

    భారతీయ కంపెనీలు త‌మ ఎగుమ‌లతుల‌ను ఈ మధ్యవర్తిత్వ పోర్టులకు రవాణా చేస్తాయి. ఇక్కడ ఉండే స్వతంత్ర సంస్థలు బాండెడ్ గిడ్డంగులలో(Bonded Warehouses) వస్తువులను అన్‌లోడ్ చేసి నిల్వ చేస్తాయి. సుంకంలేని నిల్వ సౌకర్యాలుగా పనిచేసే ఈ గిడ్డంగులు ఇక్క‌డ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ బాండెడ్ గిడ్డంగులలో త‌యారీ సంస్థ‌ల లేబుల్స్‌, పత్రాలు మార్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

    ఉదాహరణకు భారతదేశంలో తయారు చేసిన వస్తువులను దుబాయ్‌(Dubai)లో తయారు చేసిన‌ట్లు లేబుల్ అతికించ‌వ‌చ్చు. ఇలా మార్పు చేసిన తర్వాత ఆయా వస్తువులు పాకిస్తాన్‌కు దిగుమతి అవుతాయి. ఎందుకంటే పొరుగు దేశంలో భారత్‌తో ప్రత్యక్ష వాణిజ్యం అనుమతించబడదు కాబ‌ట్టి. అందుకే మార్గ‌మ‌ధ్య‌లోనే లేబుల్స్ (Labels) మార్చి పాక్‌కు ఇలా వ‌స్తువులు త‌ర‌లించుకుపోతన్నారు. ఇప్పుడు భార‌త్ ఈ ఉదంతంపై దృష్టి సారించింది.

    More like this

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్​లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూలో (Safari World Zoo) భయానక...

    Bheemgal | పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ...