- Advertisement -
HomeతెలంగాణPhysiotherapy Posts | ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Physiotherapy Posts | ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Physiotherapy Posts | ఫిజియోథెరపీ కోర్సు చేసిన వారికి గుడ్‌ న్యూస్‌. భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నిజామాబాద్‌ జిల్లాలోని13 భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ పోస్టుల (Physiotherapy Posts) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అశోక్‌ తెలిపారు.

అభ్యర్థులు దరఖాస్తులను జులై 10లోపు జిల్లా కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయం (రూమ్‌ నెంబర్‌ 117)లో అందజేయాలని సూచించారు. కాగా.. భవిత కేంద్రాల్లో ఉండే చిన్నారుల కోసం ఫిజియోథెరపిస్టులు పనిచేయాల్సి ఉంటుంది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఫిజియోథెరపిస్టులు సేవలందించాలి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News