ePaper
More
    HomeజాతీయంSpicejet | మరో విమానంలో సాంకేతిక లోపం

    Spicejet | మరో విమానంలో సాంకేతిక లోపం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Spicejet | నిత్యం విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అహ్మదాబాద్​లో విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్​పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంతో పాటు హాస్టల్​లో ఉన్నవారు మృతి చెందారు. మృతుల్లో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని కూడా ఉన్నారు. ఈ ప్రమాదం అనంతరం విమానం ఎక్కాలంటే ప్రయాణికులు ఆలోచిస్తున్నారు.

    Spicejet | నిత్యం సమస్యలు

    అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. నిత్యం విమానాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో విమానంలో వెళ్లాలంటనే ప్రయాణికులు జంకుతున్నారు. గంటల ముందు ఎయిర్​పోర్టుకు చేరుకున్నాక సాంకేతిక సమస్యతో రన్​వేపై విమానాలు నిలిచిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్(Chennai to Hyderabad) వస్తున్న స్పైస్ జెట్(Spicejet) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తిరిగి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్​ అయింది. రెండు గంటలుగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌(Chennai Airport)లో విమానం లోనే ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారు ఎయిర్​ లైన్స్​ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Asia Cup 2025 | ఆసియా కప్‌ 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లపై వ‌చ్చిన‌ స్పష్టత .. కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన‌ట్టేనా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup 2025 : ఆసియా కప్‌లో Asia Cup భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరగబోయే...

    Gold Price on August 22 | త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌… వెండి ప‌రిస్థితి ఏమిటంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 22 | గత కొన్ని రోజులుగా బంగారం Gold ధరలు...

    Ajwain Water | ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే చాలు.. సర్వ రోగాలు మటుమాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ajwain Water | వాము కేవలం ఒక వంట దినుసు మాత్రమే కాదు. అది మన...

    Gift nifty | ఏడో రోజు లాభాలు కొనసాగేనా ?.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gift nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌...

    More like this