ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Amaravati | అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్.. 140 మీటర్ల వెడల్పుతో...

    Amaravati | అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్.. 140 మీటర్ల వెడల్పుతో నిర్మాణానికి ఆమోదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amaravati | అమరావతిని దేశంలోనే మోడ్ర‌న్‌ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) భవిష్యత్ ట్రాఫిక్ వృద్ధిని దృష్టిలో ఉంచుకొని 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. పూర్వంలో కేంద్రం 70 మీటర్ల వెడల్పుతో 189 కిమీ ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu), 150 మీటర్ల వెడల్పు చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 140 మీటర్ల వెడల్పుకు అంగీకరించింది.

    Amaravati | మ‌హ‌ర్దశ‌..

    విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం సాధ్యం అవకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం(Central Government) ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా విజయవాడ పశ్చిమ బైపాస్ తెనాలి సమీపంలో 17.5 కిమీ లింక్‌ రోడ్, గుంటూరు శివారులో ఎన్‌హెచ్‌‑16 నుంచి 5.2 కిమీ లింక్‌ రోడ్.. ఈ రెండు మార్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ వెస్ట్ బైపాస్‌.. గొల్లపూడి(Gollapudi) నుంచి రాజధాని ప్రాంతం వరకూ నాలుగు చోట్ల అండర్ పాస్‌లు మరియు సర్వీస్ రోడ్లు పునరుద్ధరణకు అనుమతులు దక్కాయి. ప్రణాళిక ప్రకారం, వెస్ట్ బైపాస్ పూర్తి తర్వాత వాటిని దశలవారీగా నిర్మించనున్నారు. వినుకొండ నుంచి గుంటూరు(Vinukonda to Guntur) వరకు నాలుగు లేన్ల‌ విస్తరణ కూడా చేప‌ట్ట‌నున్నారు. ప్రస్తుతం ఎమ్‌వోఆర్‌టీ(MORT) అంగీకారంతో 84.80 కిమీ (గుంటూరు వరకు) వేశారు. మిగిలిన 24.85 కిమీను కూడా అందులో చేర్చేందుకు కేంద్రం అంగీకరించింది.

    విశాఖపట్నం పరిధిలో 12 జంక్షన్లకు ఎలివేటెడ్ బ్రిడ్జిలు, వాటిపై మెట్రో రైలు కూడా ప్లాన్‌లో ఉన్నాయి. హైదరాబాద్–విజయవాడ 226 కిమీ, విజయవాడ–మచిలీపట్నం 6 లేనుకు సంబంధించిన‌ ప్రణాళికలు త్వరలో DPIRD సిద్ధం చేయ‌నుంది. కుప్పం–హోసూర్ (56 కిమీ) కాగా, నాలుగు లేను గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం 9 నెలల్లో DPIRD సిద్ధం చేయ‌నుంది. కాకినాడ-ఒంగోలు హైవే అనుసంధానం చేసేందుకు DPIRD ని సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యించారు. చెన్నై‑కోల్‌కతా హైవే (నెల్లూరు వద్ద 17.16 కిమీ) బైపాస్ నిర్మాణం పూర్తయినప్పటికీ, దానిపై టోల్ ప్లాజా ఏర్పాటు చేసేందుకు 2015 నుంచి ఎన్​హెచ్​ఐ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే నగర పరిధి దాటిన తర్వాత మరెక్కడైనా హైవేపై టోల్​ప్లాజా ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలంటూ గడ్కరీ సూచించారు. ఓఆర్‌ఆర్ 70 మీటర్ల వెడల్పులో భూసేకరణకు గత డిసెంబరులో ఆమోదం ఇచ్చింది. ప్రతిపాదించిన అదనపు వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్ల ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందని నాయుడు తెలిపారు.

    More like this

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి సామాన్యుల‌కి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...