ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

    America | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: America | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. దుండుగుల కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. చికాగో (Chicago)లోని రివర్ నార్త్ ప్రాంతంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరుగుతున్న పార్టీపై అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఓ వాహనంలో వచ్చిన నిందితులు నైట్‌క్లబ్ (Night Club) వెలుపల గుమికూడిన జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    America | తరచూ కాల్పులు

    అమెరికాలో తరుచూ కాల్పులు చోటు చేసుకుంటాయి. సామాన్య జనంపై దుండగులు ఫైరింగ్​ చేస్తారు. కారణం లేకుండానే కాల్పులకు తెగబడిన ఘటనలు ఉన్నాయి. కొందరైతే మానసిక సమస్యలతో ప్రజలపై గతంలో కాల్పులు చేశారు. దీనికి ప్రధాన కారణం అమెరికాలో విచ్చలవిడిగా తుపాకులు, గన్​లు అందుబాటులో ఉండటమే.

    అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంలో మనుషుల కంటే తుపాకులే ఎక్కువ ఉండటం గమనార్హం. ఎవరికి పడితే వారికి గన్​లు ఇస్తుండటంతో అక్కడ తరుచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల మధ్య జరిగే యుద్ధాలను ఆపామని చెప్పుకునే అమెరికా తమ దేశంలో జరిగే కాల్పులను ఆపకపోవడం గమనార్హం. యేటా ఇలాంటి ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు పోతున్నా చర్యలు చేపట్టకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...