ePaper
More
    HomeతెలంగాణPCC Chief | కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై పీసీసీ చీఫ్​ ఆగ్రహం

    PCC Chief | కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై పీసీసీ చీఫ్​ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి (MLA Anirudh Reddy)పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని అనిరుధ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) ఆగిపోవాలంటే.. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులకు కల్పిస్తున్న సౌకర్యాలను నిలిపి వేయాలని ఆయన సూచించారు.

    ఇరిగేషన్‌ ప్రాజెక్టు, రోడ్డు కాంట్రాక్టర్లలో చంద్రబాబు కోవర్టులే ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కోవర్టులకు నల్లా, కరెంట్​ కనెక్షన్​ కట్​ చేయాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో ఒక్క రూపాయి కూడా వారికి వెళ్లకుండా ఆపాలని కోరారు. అప్పుడు వాళ్లే చంద్రబాబు దగ్గరకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్​ ఆపించేస్తారని పేర్కొన్నారు.

    అనిరుధ్​ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ (PCC President Mahesh Goud) స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉంటామని హెచ్చరించారు. గతంలో సైతం అనిరుధ్​రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. తాజాగా చంద్రబాబు కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...