ePaper
More
    HomeFeaturesApple foldable phone | ఆపిల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌.. లాంచింగ్​ ఎప్పుడంటే..!

    Apple foldable phone | ఆపిల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌.. లాంచింగ్​ ఎప్పుడంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Apple foldable phone | ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ అయిన ఆపిల్‌(Apple) ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌(Foldable iPhone)ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాదిలో దీనిని లాంచ్‌(Launch) చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఈ మోడల్‌ ఫోన్‌పై ఆపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ లీకవుతున్న సమాచారం, నివేదికల ప్రకారం ఆపిల్‌ తన ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను P1, P2 P3 ప్రొటోటైప్‌ దశల ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో దశ టెస్టింగ్‌ పూర్తవడానికి దాదాపు రెండు నెలలు పట్టనుంది. ఇప్పటికే మొదటి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ప్రోటోటైప్‌(P1) దశను ప్రారంభించినట్లు సమాచారం. మూడు దశలు పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్‌ వెరిఫికేషన్‌ టెస్ట్‌ (ఈవీటీ) చేసి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్‌లో లాంచ్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు విడుదల చేస్తారని భావిస్తున్నారు. లీకైన సమాచారం మేరకు స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

    • ఫోల్డబుల్‌ ఐఫోన్‌ 7.58 నుంచి 7.8 inch ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, అధిక రిఫ్రెష్‌ రేట్‌, బుక్‌ స్టైల్‌ ఫోల్డింగ్‌ డిజైన్‌ కలిగి ఉంటుంది.
    • సాధారణ ఫోల్డబుల్‌ ఫోన్‌లలో కనిపించే డిస్‌ప్లే క్రీజ్‌ సమస్యను తగ్గించేందుకు ఆపిల్‌ ‘‘క్రీజ్‌ ఫ్రీ’’ ప్యానెల్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం.
    • డ్యుయల్‌ 48 MP కెమెరాలు, ఆపిల్‌ సిలికాన్‌ చిప్‌ అమర్చనున్నారు.
    • ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ధర సుమారు రూ. 1.97 లక్షలు ఉండొచ్చని అంచనా.

    Apple foldable phone | సాంసంగ్‌తో పోటీ..

    ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ప్రీమియం ఫోల్డబుల్‌ మార్కెట్‌లో సాంసంగ్‌(Samsung), గూగుల్‌, హువాయ్‌ వంటి బ్రాండ్‌లతో పోటీపడనుంది. కాగా ప్రస్తుతం ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో సామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌(Galaxy Z) సిరీస్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆపిల్‌ తన ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో దీనికి పోటీ ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఫ్లెక్సిబుల్‌ డిస్‌ప్లేల ఉత్పత్తి సవాళ్లు, అధిక ధర, మార్కెట్‌ డిమాండ్‌ వంటి అంశాల నేపథ్యంలో ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...