అక్షరటుడే, ఇందూరు: Bus Charge | ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులపై భారం పడింది. టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపినట్లు ఆర్టీసీ (RTC officials) చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో (Palle Velugu and Express buses) మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే టికెట్ రేట్లు (rtc ticket rates) పెంచడంతో ఉచిత భారాన్ని భర్తీ చేసుకుంటుందనే విమర్శలు ఉన్నాయి.
Bus Charge | హైదరాబాద్‌కు ఎక్కువ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Joint Nizamabad district) పరిధిలో ఆరు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి నుంచి ఎక్కువ బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ (Nizamabad to Hyderabad) వెళ్లే మార్గంలో మొత్తం 3 టోల్ గేట్లు ఉండగా.. బస్ టికెట్టుపై రూ.30 నుంచి రూ.40 వరకు ఛార్జీలు పెంచారు.
Bus Charge | టోల్ గేట్లు లేని మార్గాల్లో సైతం..
టోల్ ఛార్జీలు పెరగటంతో టికెట్ ధరలు (ticket prices) పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే టోల్గేట్లు లేని మార్గాల్లో సైతం రేట్లు పెంచడం గమనార్హం.
నిజామాబాద్ – ఆర్మూర్ (Nizamabad-Armoor), నిజామాబాద్–బోధన్ మార్గాల్లో (Nizamabad-Bodhan routes) టోల్గేట్లు లేవు. అయినా ఈ మార్గాల్లో కూడా రేట్లు పెంచారు. పల్లె వెలుగు బస్సుల్లో ఒక స్టేజీ చొప్పున నిర్ణయించి చార్జీలు వసూలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో మాత్రం మొత్తం కిలోమీటర్లను పరిగణలోకి తీసుకుంటారు. తాజాగా కిలోమీటర్ల సర్దుబాటు చేపట్టి రేట్లు పెంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో చిల్లర సమస్య పేరుతో బస్సు చార్జీలను రౌండప్ చేసేవారు. తాజాగా కిలోమీటర్ల చొప్పున చార్జీలను సర్దుబాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడుతుంది.
నిజామాబాద్ నుంచి ఆర్మూర్‌కు (Nizamabad-Armoor) 26 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని 30 కి.మీ.గా సర్దుబాటు చేసి రూ.50 ఉన్న చార్జిని రూ.60కు పెంచారు. బోధన్ నుంచి నిజామాబాద్‌కు గతంలో రూ.50 టికెట్ ధర ఉండేది. ప్రస్తుతం దానిని రూ.60కి పెంచారు.
- నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు అన్ని సర్వీసులపై రూ.30కి పెంచారు.
- హైదరాబాద్‌కు బస్సు ఛార్జీలు వివరాలు (రూ.లో..)
బస్సు పాత ధర కొత్త ధర
- ఎక్స్‌ప్రెస్ రూ.260.. రూ.290
- సూపర్ లగ్జరీ రూ.340.. రూ.370
- ఎలక్ట్రిక్ రూ.360.. రూ.390
- రాజధాని రూ.430.. రూ.460
- లహరి రూ.450.. రూ.480

Bus Charge | టోల్ చార్జీలు పెరగడంతోనే
– జ్యోత్స్న, రీజనల్ మేనేజర్
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల చార్జీలు పెంచారు. దీంతో ఆర్టీసీ బస్సులో రేట్లు పెంచాల్సి వచ్చింది. టోల్ గేట్లు ఉన్న మార్గాల్లో ప్రయాణించే వారిపై అదనపు భారం పడుతుంది.