ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | రైల్ రోకోను విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | రైల్ రోకోను విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జులై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్​ రోకో కార్యక్రమాన్ని (Rail Roko program) విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ బిల్లు సాధించేందుకు చేపట్టనున్న రైల్​రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టామని తెలిపారు. బీసీ బిల్లుపై బీజేపీ (BJP) చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు (BJP president Ramchandra Rao) లెటర్ రాశామని పేర్కొన్నారు.

    MLC Kavitha | ‘స్థానిక’ ఎన్నికల ఎలా వెళ్తారు

    బీసిలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) ఎలా వెళ్తారని కవిత ప్రశ్నించారు. మల్లి ఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్​లో ఎన్నడూ మాట్లాడలేదని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్​కు రానున్న మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge).. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా బీజేపీపై ఒత్తిడి తేవాలన్నారు. కులగణన వివరాలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేవలం పాత లెక్కలే చెబుతున్నారని.. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలన్నారు.

    MLC Kavitha | బీసీ బిల్లుపై ఒత్తిడి తెస్తాం

    జులై 17న రైల్ రోకో (rail roko) నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacherla project) విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోందని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్ట్​పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కొందరి కాంట్రాక్టుల కోసమే ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్తులు ఉన్నారని విమర్శించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచర్లను ఆపాలని, ఇందుకు గట్టిగా కొట్లాడాలని డిమాండ్​ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...