ePaper
More
    HomeతెలంగాణUniversity Of Hyderabad | ఆస్ట్రేలియాలో రీసెర్చ్​కు ఎంపికైన హైదరాబాద్ విద్యార్థి

    University Of Hyderabad | ఆస్ట్రేలియాలో రీసెర్చ్​కు ఎంపికైన హైదరాబాద్ విద్యార్థి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: University Of Hyderabad | యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​ (UoH) విద్యార్థి ఆస్ట్రేలియాలో పరిశోధనకు ఎంపికయ్యాడు. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో (Australian National University) చేపట్టే రీసెర్చ్​కు సెలెక్ట్​ అయ్యారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రణవ్ అనే విద్యార్థి ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ (Integrated MA Economics) చివరి సంవత్సరం చదువుతున్నాడు. తాజాగా ఆయన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, కాన్‌బెర్రాలోని ప్రతిష్టాత్మక ఫ్యూచర్ రీసెర్చ్ టాలెంట్ (FRT) కార్యక్రమానికి ఎంపికయ్యాడు.

    ప్రణవ్​ ప్రస్తుతం నేషనల్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ పాపులేషన్ హెల్త్‌లో చైల్డ్​హుడ్​ షాక్స్​, ఆరోగ్యకరమైన జీవనం అనే ప్రాజెక్ట్​ చేపడుతున్నాడు. ప్రస్తుతం ఎఫ్​ఆర్​టీ స్కాలర్​షిప్​కు (FRT scholarship) ఎంపిక కావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రణవ్​ను అభినందించారు. ఈ స్కాలర్​షిప్​లో భాగంగా ఆయన 8,500 ఆస్ట్రేలియా డాలర్ల (రూ.4.7 లక్షల) స్టైఫండ్ అందుకుంటారు. ఈ ప్రాజెక్ట్​ కోసం ప్రణవ్​ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు.

    More like this

    Global markets mood | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global markets mood : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. అన్ని ప్రధాన మార్కెట్లు లాభాలతో...

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...