ePaper
More
    HomeతెలంగాణFormula E Race Case | ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్​ అధికారి

    Formula E Race Case | ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్​ అధికారి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Formula E Race Case | సీనియర్​ ఐఏఎస్ అధికారి అరవింద్​ కుమార్​ (IAS officer Arvind Kumar) గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో ఏసీబీ ఆయనను ప్రశ్నిస్తోంది. ఇటీవల ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్​ను (KTR) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్​మెంట్​ ఆధారంగా అరవింద్​కుమార్​ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

    Formula E Race Case | వేగం పెంచిన ఏసీబీ

    ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ వేగం పెంచింది. హైదరాబాద్​లో (Hyderabad) నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసులో (Formula E car race) అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్​ ఆమోదం లేకుండానే అప్పటి మంత్రి కేటీఆర్​ నిధులు కేటాయించారని ఏసీబీ పేర్కొంటుంది. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు (Case Registered) చేసి విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ రేసులో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్​ అరవింద్​కుమార్​ను మరోసారి ప్రశ్నిస్తోంది.

    Formula E Race Case | విదేశాల్లో ఉండడంతో ఆలస్యం

    ఐఏఎస్​ అరవింద్​ కుమార్​ను (IAS officer Arvind Kumar) జులై 1న విచారణకు రావాలని ఏసీబీ గతంలో నోటీసులు (ACB notices) ఇచ్చింది. అయితే ఆయన విదేశాల్లో ఉండడంతో విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో బుధవారం మళ్లీ నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్​ (KTR) అంశాలపై అరవింద్​కుమార్​ క్రాస్​ ఎగ్జామిన్​ చేయనున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...