- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిBanswada Congress | కాంగ్రెస్​ కార్యకర్తలు హైదరాబాద్​కు తరలిరావాలి

Banswada Congress | కాంగ్రెస్​ కార్యకర్తలు హైదరాబాద్​కు తరలిరావాలి

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Congress | హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాక సమావేశానికి కార్యకర్తలు తరలిరావాలని వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లాల్​బహదూర్​ స్టేడియంలో జరుగనున్న సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని పేర్కొన్నారు.

Banswada Congress | పీసీసీ చీఫ్​ నేతృత్వంలో..

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud), రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకురాలు మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy), ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారని తెలిపారు. ఉమ్మడి వర్ని మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Banswada Congress | స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం..

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ వెలగపూడి గోపాల్, సీనియర్ నాయకులు కలాల్ గిరి, అబ్దుల్ బారి, జాకోర పీఏసీఎస్​ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, నిఖిల్, ఏఎంసీ డైరెక్టర్ అహ్మద్, పీఏసీఎస్​ డైరెక్టర్ నరేడ్ల సాయిలు, ఏఎంసీ డైరెక్టర్ అహ్మద్, మాజీ సర్పంచులు శ్రీనగర్ రాజు,నాని బాబు,పీర్య నాయక్, డీసీసీ డెలిగేట్ ప్రవీణ్ గౌడ్, అవేజ్, గఫర్ భాయ్, నాగేష్, హనుమంతరావు, సలీం భాయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News