ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Anakapalli | యువకుడిని సముద్రంలోకి లాక్కెళ్లిన చేప

    Anakapalli | యువకుడిని సముద్రంలోకి లాక్కెళ్లిన చేప

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anakapalli | చేపల వేటకు వెళ్లిన యువకుడిని ఓ భారీ మీనం (huge fish) సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్​లో (Andhra Pradesh) చోటు చేసుకుంది.

    ఏపీలోని అనకాపల్లి జిల్లా (Anakapalle district) అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన కొందరు బుధవారం ఉదయం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన వారిలో చోడపల్లి యర్రయ్య(26) ఆయన తమ్ముడు కొర్లయ్య, వాసుపల్లి యల్లాజి, గనగళ్ల అప్పలరాజు ఉన్నారు. ఈ క్రమంలో భారీ చేపను పట్టుకునే యత్నంలో యర్రయ్య గల్లంతయ్యాడు.

    Anakapalli | చూస్తుండగానే..

    సముద్రంలో వేట సాగిస్తుండగా యర్రయ్యకు భారీ చేప చిక్కింది. సుమారు వంద కిలోల బరువుండే కొమ్ముకొనాం చేప (kommakonam fish) చిక్కడంతో యర్రయ్య సంబర పడ్డాడు. అయితే దానిని బోటులోకి లాగడానికి యర్రయ్య యత్నించారు.

    ఈ క్రమంలో భారీ చేప యర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. తమ కళ్లముందే యర్రయ్య నీటిలో గల్లంతు కావడంతో వేటకు వెళ్లిన వారు తీవ్రంగా విలపించారు. అనంతరం గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు, అధికారులు బుధవారం సాయంత్రం వరకు గాలించినా యర్రయ్య ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో పూడిమడక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...