ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BC Yuvajana Sangham | బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి

    BC Yuvajana Sangham | బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: BC Yuvajana Sangham | బీసీలకు దామాషా ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరికీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. కానీ 56 శాతం ఉన్న బీసీలకు (BC Reservations) కేవలం 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమన్నారు.

    BC Yuvajana Sangham | కేంద్ర కులగణనను స్వాగతిస్తున్నాం

    కేంద్ర ప్రభుత్వం కులగణన (Caste census) చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అజయ్​ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిందో దానిని వెంటనే అమలు చేసేవిధంగా కృషి చేయాలని డిమాండ్​ చేశారు. ఈ రిజర్వేషన్లు రాజకీయంగా విద్యా, ఉద్యోగ పరంగా ఉండాలని సూచించారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ శంకర్ మాట్లాడుతూ.. 130 బీసీ కులాల్లో ఇప్పటికీ అనేక కులాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయని.. 42 శాతం రిజర్వేషన్లు అమలైతేనే వారందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తూ కేంద్రం బిల్​ పాస్​ చేయాలని కోరారు.

    BC Yuvajana Sangham | రుణాలు తొందరగా ఇవ్వాలి

    రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పేరుతో యువతకు ఇవ్వాలనుకున్న రుణాలను తొందరగా ఇవ్వాలని శంకర్​ డిమాండ్​ చేశారు. రుణాల్లోనూ బీసీలకు 42 శాతం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో బీపీ యువజన సంక్షేమ సంఘం నాయకులు విజయ్, బసవ సాయి, మురళి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...