ePaper
More
    HomeసినిమాHarihara Veera Mallu | ఆదిలోనే ఎదురుదెబ్బ‌.. సంధ్య థియేట‌ర్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ స్క్రీనింగ్...

    Harihara Veera Mallu | ఆదిలోనే ఎదురుదెబ్బ‌.. సంధ్య థియేట‌ర్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ స్క్రీనింగ్ ర‌ద్దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harihara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “హరి హర వీర మల్లు. కాగా, ఈ మూవీని జులై 24న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

    ఎన్నో నెలల నుంచి ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ట్రైలర్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) 50కి పైగా థియేటర్లలో ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, అభిమానుల్లో ఆనందం నెలకొన్న‌ సమయంలో తెలంగాణ పోలీసుల అనుమతి నిరాకరణతో ట్రైలర్ స్క్రీనింగ్‌లో (trailer screening) ఊహించని మలుపు చోటు చేసుకుంది. జూలై 3న ఉదయం 11:10కి ట్రైలర్‌ను ఏకకాలంలో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయించింది.

    Harihara Veera Mallu | ఆ కార‌ణం వ‌ల్ల‌నే..

    హైదరాబాద్‌లోని బాలానగర్ విమల్ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ సహా అనేక హాల్స్‌ను ఎంపిక చేశారు. ట్రైల‌ర్ స్క్రీనింగ్ సంద‌ర్భంగా అభిమానులు థియేట‌ర్స్ (Theatres) ద‌గ్గ‌ర భారీ ఎత్తున‌ డెకరేషన్‌లు కూడా ఏర్పాటు చేశారు. అయితే జూలై 2వ తేదీ ఉదయం, ట్రైలర్ స్క్రీనింగ్ కోసం ఎంట్రీ పాస్‌లు ఇవ్వ‌గా, ఆ స‌మ‌యంలో భారీ సంఖ్యలో అభిమానులు సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద గుమికూడారు. పెద్దఎత్తున వ‌చ్చిన అభిమానులని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వచ్చింది. ఎంట్రీ పాస్ లకే ఈ రేంజ్ లో హంగామా ఉంటే ఇక ట్రైలర్ ప్రదర్శన సమయంలో అభిమానుల హంగామా ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందోన‌ని ముందస్తు జాగ్ర‌త్త‌గా సంధ్య థియేట‌ర్‌లో ట్రైల‌ర్ స్క్రీనింగ్ ర‌ద్దు (trailer screening cancel) చేశారు.

    ఇటీవల “పుష్ప 2” (Pushpa 2) ట్రైలర్‌ స్క్రీనింగ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre stampede), మహిళ మరణం, చిన్నారి కోమాలోకి వెళ్లిన విషాద ఘటనల నేపథ్యంలో ఈసారి ట్రైలర్ స్క్రీనింగ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో థియేటర్ యాజమాన్యం హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రదర్శన రద్దు అయ్యిందని ప్రకటిస్తూ నోటీసు బోర్డులు పెట్టింది. భద్రతా పరంగా ఇది సరైన నిర్ణయమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

    సంధ్య థియేట‌ర్ (Sandhya theatre) త‌ప్ప హైద‌రాబాద్‌లోని మిగ‌తా అన్ని థియేట‌ర్స్‌లో కూడా ట్రైల‌ర్ స్క్రీనింగ్ జ‌రుపుకోనుంది. ఇక “హరి హర వీర మల్లు” సినిమా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మొత్తానికి, భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న హరిహర వీర మల్లు ట్రైలర్ స్క్రీనింగ్ కొన్ని థియేటర్లలో రద్దయినప్పటికీ, అభిమానుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. యూట్యూబ్‌లో మాత్రం ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...