Rain Alert
Rain Alert | అలెర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి.

బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అయితే గురువారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు.

నాలుగు రోజులుగా వాతావరణం మేఘావృతమై ఉంది. రోజంతా ముసురు పట్టినట్లు ఉండి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం పూట మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అయితే ఈ రోజు ముసురు ఉండదని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని పేర్కొన్నారు.

పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సాయంత్రం, రాత్రి పూట వాన పడే ఛాన్స్​ ఉందని తెలిపారు. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్​ నగరం (Hyderabad City) సిటీలో చాలా రోజుల తర్వాత ఎండ వస్తుందని పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి పూట నగరంలో అకస్మాత్తుగా వానలు పడే అవకాశం ఉంది.